ఆందోళన: బిజెపి నేతల అరెస్టు
హైదరాబాద్: శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డుకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి), విశ్వహిందూ పరిషత్, ఎబివిపి రాష్ట్రంలో ఆందోళనలకు దిగాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రాజమండ్రి, విజయవాడ, గుంటూరుల్లో ఎబివిపి కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
హైదరాబాదులో నిరనస ప్రదర్శనకు దిగిన బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, ఎన్. ఇంద్రసేనా రెడ్డి, జి. కిషన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాదులో ప్రదర్శనకు దిగిన దాదాపు 250 మంది కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.












Click it and Unblock the Notifications