మెగా వేదికపై చిరు ఫ్యాన్స్ గొడవ

బహిరంగ సభ నిర్వహణకు అధికారులు తిరుచనూరులోనే ఉన్న నందికుంట వద్ద గల 40 ఎకరాల స్థలాన్ని చూపారు. ఇందులో మూడు, నాలుగు లక్షల మంది పడతారు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఈ రెండు స్థలాలను కూడా చూసి అవిలాల స్థలాన్ని ఎన్నిక చేసుకున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి సోదరుదడు నాగబాబు బుధవారం చూసిన తర్వాత స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇంతలో చిరంజీవి అభిమానుల మధ్య విభేదాలు తలెత్తాయి. చిరంజీవి సేవాదళ్ కు చెందిన అశోక్ సామ్రాట్ అవిలాల ట్యాంక్ స్థలంలో బహిరంగ సభ నిర్వహణకు పట్టుబడుతుండగా, చిరంజీవి యువసేనకు చెందిన సి.ఆర్. రాజన్ నందికుంటలో సభ నిర్వహణను కోరుకుంటున్నారు. అయితే, వీరిద్దరు కూడా ప్రజలకు పెద్దగా తెలియదు. చిరంజీవి దృష్టిని ఆకర్షించడానికే వీరిద్దరూ ఈ విధమైన చర్యలకు పూనుకుంటున్నారనే వాదన వినిపిస్తున్నది. తమకంతా తెలుసునని, చిరంజీవి రక్షణ కోసం శిక్షణ పొందిన 2,500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశామని, ప్రజలు వేదికకు 100 అడుగుల దూరం నుంచే కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి విధేయులు అంటున్నారు.












Click it and Unblock the Notifications