బుద్ధి మానుకోని పాకిస్తాన్
న్యూఢిల్లీ: భారత్ హెచ్చరించినప్పటికీ జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడం మానలేదు. జమ్మూ కాశ్మీర్ హింసను వెంటనే ఆపాలని పాకిస్తాన్ సూచించింది. ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ కార్యాలయానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేష్ వెళ్లి కాల్పుల్లో మరణించిన కాశ్మీర్ వేర్పాటువాద నే షేక్ అబ్దుల్ అజీజ్ కు నివాళులర్పించారు. భద్రతా బలగాల అతి చర్య వల్లనే అజీజ్ మరణించాడని ఆయన వ్యాఖ్యానించారు.
కాశ్మీరీలపై భారత భద్రతా బలగాల చర్యలను ఆయన ఖండించారు. జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘకు స్వస్తి చెప్పాలని ఆయన అన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్ హెచ్చరించిన మర్నాడే ఖురేషీ ఈ జోక్యానికి పూనుకున్నారు.












Click it and Unblock the Notifications