హైదరాబాద్: రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయం అందించాలని సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులు అభిమానులను కోరారు. వారు బుధవారం క్యాంపు కార్యాయలంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి ఐదు లక్షల రూపాయల అందజేశారు. వరద బాధితుల కోసం తాము చేయాల్సింది చేశామని, ఇతరులు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలని, డబ్బుల రూపంలోనే సహాయం చేయాల్సిన అవసరం లేదని, ఇతర రూపాల్లో కూడా సహాయం చేయవచ్చునని వారన్నారు.
వరద ప్రాంతాల్లోని మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలియజేశారు. వరదల బీభత్సం బాధాకరమని వారన్నారు. వరదల వల్ల ఎంతో మంది చనిపోయారని, భారీ నష్టం సంభవించిందని, ఇదంతా చూసి తమకెంతో బాధ కలిగిందని వారన్నారు.