తిరుమలలో తీవ్రమైన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవ స్ధానం భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ శనివారం కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే పరిస్ధితి ఉండే అవకాశముంది. శనివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీనితో ఆలయ అధికారులు మహా లఘు దర్శనం కొనసాగిస్తున్నారు. మిగితా దర్శనాలను కొన్ని గంటలపాటు రద్దు చేశారు. గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 26 న చిరంజీవి బహిరంగసభ ఉన్నందువల్ల 25, 26, 27 తేదీల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications