టిడిపి వల్లనే చిరు పార్టీ: దత్తాత్రేయ
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైఫల్యం వల్లనే మెగాస్టార్ చిరంజీవి పార్టీ వచ్చిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. మూడో ప్రత్యామ్నాయం వల్ల బిజెపికే లాభం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రంలో అన్ని శాసనసభా సీట్లకు, పార్లమెంటు సీట్లకు పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు వుండదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సొంతంగా విస్తరించాలన్నదే తమ అభిమతమని, అందువల్ల ఎవరితోనూ పొత్తు పెట్టుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications