స్టెప్పులేస్తే సరిపోదు: చిరుపై ధర్మాన
శ్రీకాకుళం: సినిమాల్లో స్టెప్పులేసినంత మాత్రాన అభివృద్ధి జరగదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. రాజకీయాలంటే సినిమాల్లో స్టెప్పులేయడం కాదని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక కార్యక్రమంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. తమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అంతటి పరిణతి చెందిన నాయకుడు రాష్ట్రంలో లేడని ఆయన అన్నారు.
సినిమాలు చూసి గెంతులేయడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. తమ కాంగ్రెస్ పార్టీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల గానీ, కొత్త పార్టీ వల్ల గానీ కాదని ఆయన అన్నారు. మంచి సినిమా వస్తుందని ప్రజలు వెళ్లిపోతారా అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications