సర్పంచ్ లపై లాఠీ: సభలో వివాదం
హైదరాబాద్: హైదరాబాదులో ధర్నా సందర్భంగా సర్పంచులపై పోలీసు లాఠీచార్జీపై శుక్రవారం శాసనసభలో కొద్ది సేపు వివాదం చెలరేగింది. జీరో అవర్ లో తెలుగుదేశం పార్టీ సభ్యుడు నరేంద్రరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. సర్పంచులపై గురువారం పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ఈ విషయంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో కాసేపు సభలో గందరగోళం చెలరేగింది.
జీరో అవర్ లో ప్రస్తావించిన అంశంపై సభలో చర్చ జరగదని సభాధ్యక్షుడు అన్నారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. జీరో అవర్ లో దానిపై చర్చకు అవకాశం ఉండదని, దానిపై విస్తృతంగా చర్చ జరగాలంటే వేరే రూపంలో రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications