A సీక్రెట్ బయటపెట్టిన వైభవ్ సూర్యవంశీ..! ప్యూర్ పర్సనల్ ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో తన దూకుడైన బ్యాటింగ్ తో దాదాపు సెంచరీ చేసినంత పని చేసి, రాజస్థాన్ రాయల్స్ ను విజయతీరాలకు చేర్చిన బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఓ సీక్రెట్ ను మాత్రం మిగిల్చాడు. ఈ మ్యాచ్ లో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్.. ఆ తర్వాత ఒక్కసారిగా గేరుమార్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత తన రెండు చేతి వేళ్లను కలిపి ఏ అనే లెటర్ వచ్చేలా ఫ్యాన్స్ కు ఓ సంజ్ఞ చూపించాడు.
దీంతో ఎప్పుడూ లవ్ సింబల్ తరహాలో వేళ్లు పెట్టి చూపించే వైభవ్.. ఈసారి మాత్రం ఎందుకిలా ఏ సింబల్ ను ఎంచుకున్నాడు, దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని ఫ్యాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. కొందరు అయితే ఇండియా ఏ టీమ్ లోకి తనకు పిలుపు వచ్చిందనే విషయాన్ని చెప్పడానికి ఇలా సంజ్ఞ చేశాడా అని కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత టీమే మేనేజర్ తో సరదాగా మాట్లాడుతూ వైభవ్ స్వయంగా ఆ మిస్టరీని ఛేదించేశాడు. అయితే దీన్ని పూర్తిగా పర్సనల్ గా ఉంచాలని తాను భావించినట్లు ఈ బుడ్డోడు చెప్పుకొచ్చాడు.

Always a mumma's boy 💗 pic.twitter.com/k3X7HVEXTA
— Rajasthan Royals (@rajasthanroyals) May 19, 2026
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటర్ మురళీ కార్తీక్ అడిగినా ఇందులో ఎలాంటి లోతైన అర్ధం లేదంటూ తప్పించుకున్న వైభవ్.. టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌తో మాట్లాడుతూ.. ఈ సంబరం తన తల్లికి అంకితమైన నివాళి అని, ఆమె పేరు 'A' అక్షరంతో మొదలవుతుందని వివరిస్తూ ఆ సంబరం చేసుకున్నట్లు వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ హృద్యమైన విషయం, ఆ విధ్వంసకర ఓపెనర్‌లోని ఒదిగి ఉండే స్వభావాన్ని స్పష్టం చేస్తుందని క్రీడావర్గాలు చర్చించుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications