వాషింగ్టన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి కి అమెరికా ప్రభుత్వం నుండి మరోసారి వీసా నిరాకరణ జరిగింగి. ఈ వీక్ లో న్యూజెర్సీలో జరగనున్న గుజరాతీ మహాసభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. గుజరాత్ అల్లర్ల సందర్భంగా వేల మంది మృతి చెందగా నరేంద్రమోడి భాద్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసారని మానవహక్కులకు విలువనివ్వని వ్యక్తికి అమెరికా వచ్చే అవకాశం ఇవ్వరాదని అక్కడ మానవ హక్కుల సంఘాలు కోరటంలో ఈ నిర్ణయం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇదే కారణంపై వీసా నిరాకరించారు.