మిత్రాతో పొత్తుపై చర్చించలేదు: ఏచూరి
హైదరాబాద్: ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రాతో పొత్తులపై చర్చించలేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు. డాక్టర్ మిత్రా తమ పార్టీకి మిత్రుడని ఆయన చెప్పారు. మర్యాదపూర్వకంగానే మిత్రా తనను కలిశారని ఆయన చెప్పారు.
జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేస్తున్న సిపిఎం రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తుల విషయం అత్యంత కీలకంగా మారింది. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, అటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వామపక్షాలతో స్నేహానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. సిపిఎం మాత్రం ఎటూ తేల్చడం లేదు.












Click it and Unblock the Notifications