మరోసారి సిమిపై నిషేధం పొడగింపు
న్యూఢిల్లీ: స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై సుప్రీంకోర్టు మరోసారి నిషేధాన్ని పొడిగించింది. అక్టోబర్ రెండో వారం వరకు సిమిపై నిషేధాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిమిపై సుప్రీంకోర్టు పొడిగించడం ఇది రెండో సారి.
సిమిపై నిషేధాన్ని ఎత్తేస్తూ ట్రిబ్యునల్ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సిమిపై నిషేధాన్ని విధించడానికి అవసరమైన వాదన సారాంశాన్ని, పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మతతత్వ సంస్థ అయిన సిమి భారత శాంతి, సమగ్రత, లౌకిక వ్యవస్థకు ప్రమాదరకంగా పరిణమించిందని కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేంద్రం మరింత సమయం కోరడంతో సుప్రీంకోర్టు సిమిపై నిషేధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications