కరీంనగర్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో పెట్టుకున్నా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే ఆ పొత్తు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావు అన్నారు. జై తెలంగాణ అనే పార్టీలతోనే తాము వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
హైదరాబాద్ రాష్ట్ర విమక్తి దినోత్సవమైన సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు సెప్టెంబర్ 17వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకను ఆవిష్కరించాలని ఆయన అన్నారు.