ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావతంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ఒరిస్సాలోని పారాదీప్ కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తీరాన్ని దాటే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈదురగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులెవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications