ఆకుపచ్చని చీరలో దుర్గమ్మ దర్శనం.. రేపు కూడా రాజరాజేశ్వరి దేవిగానే..

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని ఉత్సవాల ఆఖరి రోజైన ఇవాళ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిస్తున్నారు. నవరాత్రుల చివరి ఘట్టం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో దుర్గగుడి ప్రాంతం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం వేకువజాము నుంచే దర్శనాలు ప్రారంభించినట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. బుధవారం కూడా ఇదే అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆకుపచ్చని చీరలో పరమ పవిత్ర రూపం.. పులిహోర, గారెలు నైవేద్యం

సకల జగత్తుకు అధిష్ఠాన దేవతగా, సమస్త శక్తులకు మూలస్వరూపిణిగా భావించే జగన్మాత రాజరాజేశ్వరీ దేవి దివ్యస్వరూపంలో భక్తులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నారు. పరాశక్తి పరిపూర్ణ స్వరూపమైన అమ్మవారు ఈ రోజు ఆకుపచ్చని చీరలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రకృతికి, సస్యశ్యామలత్వానికి, జీవన చైతన్యానికి ప్రతీకగా నిలిచే ఆకుపచ్చని వర్ణంలో అమ్మవారి రూపం మరింత మనోహరంగా విరాజిల్లుతోంది. దివ్యాభరణాలు, విశేష పుష్పాలంకరణలతో అలరారుతున్న అమ్మవారికి ఈ రోజు భక్తిశ్రద్ధలతో పులిహోర, గారెలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు.

Vijayawada Dasara Grand Finale Kanaka Durga Worshipped as Rajarajeshwari Devi on Final Day
మూలా నక్షత్ర వైభవం.. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రి కిటకిట
మూలా నక్షత్ర వైభవం.. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రి కిటకిట

పోటెత్తిన జనసందోహం.. 13 లక్షలు దాటిన దర్శనాలు

శరన్నవరాత్రుల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏకంగా 13 లక్షల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న మహాపూర్ణాహుతితో నవరాత్రి ఉత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి. మధ్యాహ్నం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఇంద్రకీలాద్రిని సందర్శించి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Mysuru Dasara 2026: మైసూరు దసరా ఉత్సవాలు షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Mysuru Dasara 2026: మైసూరు దసరా ఉత్సవాలు షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెప్పోత్సవంతో ముగింపు

శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం కృష్ణానదిలో వైభవంగా హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కృష్ణమ్మ హారతుల నడుమ సాగే ఈ కన్నులపండువ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు కృష్ణాతీరానికి భారీగా చేరుకుంటున్నారు. జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి దేవి కరుణాకటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ భక్తులు ఇంద్రకీలాద్రిపై మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+