విశ్వం పుట్టుక రహస్యాల వేట: మార్స్ చందమామ 'ఫోబోస్'పై జపాన్ స్పేస్ క్రాఫ్ట్

జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ.. భారీ ప్రాజెక్ట్ ను చేపట్టింది. మార్టిన్ మూన్స్ ఎక్స్‌ప్లోరేషన్' (MMX) స్పేస్ క్రాఫ్ట్ ను రోదసిలోకి ప్రయోగించింది. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 4:42 నిమిషాలకు తనేగాషిమా స్పేస్ సెంటర్ నుంచి హెచ్3 రాకెట్ ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ అంగారక గ్రహం వైపు దూసుకెళ్లింది. దాని చందమామ.. ఫోబోస్ నుంచి మట్టి, ఇతర నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. దాదాపు 10 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2027 ఆగస్టు నాటికి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

ఫోబోస్, డిమోస్

అంగారకుడి చుట్టూ తిరిగే ఫోబోస్, డిమోస్ అనే చందమామల ఆవిర్భావంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ అనేక సందేహాలు నెలకొన్నాయి. నిజానికి ఈ రెండు కూడా గ్రహ శకలాలు. క్రమంగా అవి మార్స్ కు ఉపగ్రహాల్లా మారాయి. అవి.. అంగారకుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షితమైనవా లేక ఏదైనా భారీ ఖగోళ వస్తువు ఢీకొట్టినప్పుడు ఎగిరిపడిన శకలాలా అనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. దీనిపై గతంలో పలు పరిశోధనలు సాగాయి గానీ ఏవీ కొలిక్కి రాలేదు.

Japan MMX Mission Launches its First-Ever Phobos Moon of Mars Samples Collection Bound for Earth

ఫోబోస్ ఉపరితలం, అంతర్గత నిర్మాణం

ఫోబోస్ ఉపరితలం, దాని అంతర్గత నిర్మాణం, గురుత్వాకర్షణ శక్తిని లోతుగా పరిశోధించడం ద్వారా సౌర కుటుంబ ఆవిర్భావంపై ఓ ఖచ్చితమైన ప్రాథమిక అవగాహన ఏర్పడుతుందని జపాన్ భావిస్తోంది. ఈ రహస్యాలను ఛేదించడానికి తాజాగా.. ఈ ఎమ్‌ఎమ్‌ఎక్స్ మిషన్ ను చేపట్టింది. ఇందులో అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు భాగస్వామ్యం వహించాయి. పేలోడ్ లను రూపొందించాయి.

అద్భుతాలను కడుపులో దాచుకున్న చందమామ
అద్భుతాలను కడుపులో దాచుకున్న చందమామ

నాసా సహా

ఫ్రాన్స్‌కు చెందిన సీఎన్‌ఈఎస్, జర్మనీ స్పేస్ రీసెర్చ్ సంస్త డీఎల్‌ఆర్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన ఐడెఫిక్స్ అనే చిన్న రోవర్‌ను ఇందులో పేలోడ్ గా పంపారు. ఫోబోస్‌పై ల్యాండ్ కావడానికి ముందే ఈ రోవర్ దాని ఉపరితలంపై దిగుతుంది. అక్కడి నేల స్వభావం, భౌగోళిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తుంది. ఏ ప్రాంతంపై, ఎటువంటి నమూనాలను సేకరించాలనేది నిర్ధారిస్తుంది. నాసా డెవలప్ చేసిన మెగాన్ అనే గామా రే, న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్‌ను ఈ వ్యోమనౌకలో అమర్చారు.

ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్
ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్

మూలకాల కూర్పు విశ్లేషణ..

ఫోబోస్ ఉపరితలంలోని మూలకాల కూర్పును ఖచ్చితంగా విశ్లేషించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఫోబోస్ చుట్టూ క్వాసి శాటిలైట్ కక్ష్యలో తిరుగుతూ దాని డేటాను సేకరిస్తాయి. నమూనాల సేకరణకు అనుకూలమైన ల్యాండింగ్ ప్రాంతాలను గుర్తించిన తర్వాతే ప్రధాన స్పేస్ క్రాఫ్ట్.. ఫోబోస్ ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో, రెండు సార్లు ల్యాండ్ అయ్యేలా దీన్ని తీర్చిదిద్దింది జపాన్. ఒక ప్రదేశంలో నమూనాలను సేకరించిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లగలుగుతుందిది.

హైదరాబాద్ లో మరో పోలీస్ కమిషనరేట్ ఆఫీస్: 22 పోలీస్ స్టేషన్లు, 6 అసెంబ్లీలు దీని పరిధిలో
హైదరాబాద్ లో మరో పోలీస్ కమిషనరేట్ ఆఫీస్: 22 పోలీస్ స్టేషన్లు, 6 అసెంబ్లీలు దీని పరిధిలో

2031 నాటికి భూమికి తిరిగి వచ్చేలా

ఫోబోస్ ఉపరితలం నుంచి కనీసం 10 గ్రాముల మట్టి, రాతి నమూనాలను సేకరించాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యోమనౌక అంగారక కక్ష్యను వీడి భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. నమూనాలతో కూడిన ప్రత్యేక క్యాప్సూల్ వ్యోమనౌక నుంచి విడిపోయి 2031 నాటికి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆస్ట్రేలియాలో రీల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఆస్ట్రేలియాలోని నిర్దేశిత ప్రాంతంలో ఈ క్యాప్సూల్‌ను రికవరీ చేస్తారు.

అంగారకుడి ఉపగ్రహం నుంచి లభించే తొలి శాస్త్రీయ సాక్ష్యాధారాలుగా ఇవి చరిత్రలో నిలువనున్నాయి. సౌర కుటుంబం ప్రారంభ రోజుల్లో గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా రూపుదిద్దుకున్నాయో, వాటి పరిణామ క్రమం ఎలా సాగిందో తెలుసుకోవడానికి ఈ డేటా శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే దిశగా జపాన్ మొదటి అడుగు వేసింది. భవిష్యత్తులో జరిగే ఇతర సుదూర గ్రహాన్వేషణలకు నూతన దిశానిర్దేశం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+