భారత్ పై ప్రభావం పడదు: ప్రధాని
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం మనదేశ ఆర్థిక వ్యవస్థపై ఉండదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే తగిన అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన శుక్రవారం మంత్రి వర్గ సమావేశంలో సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులపై అప్రమత్తంగా ఉండాలని ఆయన మంత్రులకు సూచించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభువం మన ఆర్థిక వ్యవస్థపై ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. అమెరికా బ్యాంకుల దివాళా ప్రభావం భారత బ్యాంకులపై పడబోదని చిదంబరం గురువారంనాడు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని, తద్వారా 8 శాతం ఆర్థిక పెరుగుదలను సాధిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications