రాజమండ్రి జైలు జీవిత ఖైదీల పరారీ
రాజమండ్రి: రాజమండ్రి జైలుకు చెందిన ఇద్దరు జీవిత ఖైదీలు శుక్రవారం పారిపోయారు. ఎస్కార్ట్ పోలీసుల కళ్లు కప్పి వారు పారిపోయారు. గోవిందు, నాగులు అనే ఖైదీలు గుంటూరు జిల్లా గురజాల కోర్టుకు వెళ్లి వస్తూ మార్గమధ్యంలో పోలీసుల కళ్లు గప్పి పారిపోయారు.
రాజమండ్రిలోని ఒక జంక్షన్ లో బస్సు ఆగగానే పోలీసుల కళ్లు గప్పి వారు పారిపోయారు. పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. ఒక కేసు విచారణ నిమిత్తం వారిద్దరిని పోలీసులు రాజమండ్రి జైలు నుంచి గురజాల కోర్టుకు తీసికెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications