మడమ వెనక్కి తిప్పం: వైయస్

YS Rajasekhar Reddy
కరీంనగర్: తాము మడమ వెనక్కి తిప్పలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తాము మాట తప్పలేదు, మడమ వెనక్కి తిప్పలేదని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆయన శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తాము అమలు చేశామని ఆయన చెప్పారు. తాము రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని, ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు.

కరీంనగర్ జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ వెనకబాటును పోగొట్టేందుకే 40 వేల కోట్ల రూపాయలతో ప్రాణహిత - చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుకు చేపట్టామని ఆయన చెప్పారు. పత్తి రైతులకు క్వింటాలుకు 3 వేల రూపాయల మద్దతు ధర ఇస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+