హైదరాబాద్: రాజకీయం వేరు, అభిమానం వేరని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం ఆమె ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనే విషయాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి పార్టీని తెలుగుదేశం ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ "ఆ పార్టీని ఎదుర్కోవలసిన అవసరముందా?" అని అన్నారు. సినిమాహీరో కాబట్టి ఆయనను చూడడానికి జనం వస్తే రావచ్చని, అవన్నీ ఓట్ల రూపంలోకి మారడం కష్టమని రోజా అన్నారు. చిరంజీవి పార్టీని రోజా మొదటి నుంచి తీసిపారేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవిని ఎదుర్కోడానికి కావలసినంత మెటీరియల్ ను తెలుగుదేశం మేధావుల విభాగం అందిస్తున్నట్టు సమాచారం.