మల్కాజిగిరి ఎక్సైజ్ సీఐపై ఎసిబి దాడులు
హైదరాబాద్: నగరంలోని మల్కాజిగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేశారు. ఈ దాడుల్లో 50 లక్షల రూపాయలతో ఎప్పుడో కొన్న ఆస్ధుల వివరాలు బయటపడ్డాయి. ఇప్పుడు వాటి మార్కెట్ విలువ కొన్ని కోట్ల రూపాయలు చేస్తుందని ఎసిబి అధికారులు చెబుతున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్ధులు కలిగిఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ చాలా క్రియాశీలకంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వేచ్చ లభించడంతో అవినీతి నిరోధక శాఖ చాలా వేగంగా దాడులు చేసి, కేసులను న్యాయస్ధానాల్లో ఫైల్ చేయగలుగుతోంది. ఎసిబికి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు రెండు రోజుల పాటు రిమాండ్ లో ఉంటే వారిని ఆయా శాఖల ఉన్నతాధికారులు సస్పెండ్ చేయవచ్చు. నేరం రుజువైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications