పద్మావతి ఎక్స్ ప్రెస్ లో మంటలు
ఒంగోలు : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్థమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని తెట్టు-ఉలవపాడు స్టేషన్ల మధ్య రాచర్లపాడు దగ్గర ఉదయం 3.30 గంటలకు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వేసిబ్బంది ప్రమాదానికి గురైన బోగీలను వేరుచేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications