యమునా నది పరవళ్ళు: 10 రైళ్ళు రద్దు
న్యూఢిల్లీ: యమునా నది వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. నదిలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవటంతో బ్రిడ్జిని మూసివేశారు. నదిలోకి తాజెవాలా బ్యారేజినుంచి 4,00,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరటంతో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో రైళ్లు, బస్సులు తదితర రవాణా వ్యవస్థ స్థంభించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రైల్వేశాఖ 10 రైళ్లను రద్దు చేయగా 24 రైళ్లను దారి మళ్లించింది.












Click it and Unblock the Notifications