ఏలూరు సిద్దార్ధ విద్యా సంస్ధలు రద్దు
ఏలూరు : ఏలూరులో సిద్దార్థ విద్యాసంస్థల్లో చెంపదెబ్బకు విద్యార్థి మృతి చెందిన ఘటనకు బాధుల్ని చేస్తూ ఆ విద్యాసంస్థలను పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. యాజమాన్యంపై విశ్వాసం పోయినందున సిద్దార్థ పేరిట నడుస్తున్న సంస్థలకు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్ర పరిధిలోని మూడు పాఠశాలలకు తోడు కేంద్రప్రభుత్వ పరిధిలోని సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తున్న పాఠశాలను రద్దు చేయాలని కోరుతూ సిఫారసు జారీచేసింది. అయితే విద్యాసంవత్సరం మధ్యలో వుండటంతో పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుక ఒక అడ్‌హాక్ కమిటీ ద్వారా ఈ పాఠశాలల్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications