తిరుపతి: కాణిపాకం బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవంతో ముగిశాయి. వినాయక చవితిరోజు ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 23 రోజులపాటు కొనసాగాయి. ప్రతిరోజు స్వామివారి ఉత్సవమూర్తులను కాణిపాకం పురవీధుల్లో వూరేగించారు. చివరిరోజున ఈ మూర్తులను తెప్పలో ఉంచి కాణిపాకం పుష్కరిణిలో వూరేగించారు. చివరి రోజు వరసిద్ధి వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను వేలం వేశారు. దీన్ని మెదక్ జిల్లా సిద్దిపేట వాసి శ్రీరాములు 45 వేల రూపాయలకు పాడి కైవసం చేసుకున్నారు.