రాజీవ్ హంతకురాలు నళినికి వెసులుబాటు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్షననుభిస్తున్న నళిని పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై పునర్విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఆమె క్షమాభిక్షపై పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించిన సలహాసంఘం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ హత్యకు కుట్రలో పాల్గొన్న నళినికి మొదట్లో మరణశిక్ష విధించి అనంతరం జీవితఖైదుగా మార్చారు. గత 17 సంవత్సరాలుగా నళిని వేలూరు కారాగారంలో శిక్షను అనుభిస్తోంది.












Click it and Unblock the Notifications