సిఇవో హత్యను మంత్రి సమర్ధించవచ్చా?
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ఒక సిఇవో హత్యపై తాను చేసిన వ్యాఖ్యల మీద కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నాయిడాలోని ఈ ఇటలీ కంపెనీ నుంచి తీసేసిన ఉద్యోగులు ఆ సీఇవోను చంపేసినట్టు తెలుస్తోందని, అందుకు ఆ కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాలి కానీ మరెవరినీ నిందించరాదని ఫెర్నాండెజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫిక్కి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మంత్రి ప్రకటనను ఖండించారు. హత్య ఎటువంటి సందర్భంలో జరిగినా దాన్ని సమర్ధించకూడదని ఇన్ఫోసిస్ సిఇవో నందన్ నీలేకాని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని అంతం చేసేందుకు మంత్రి ఫెర్నాండెజ్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలను అపార్ధం చేసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications