'రైల్లో మంటలు విద్రోహుల చర్య కావచ్చు'
విజయవాడ: పద్మావతి ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం అనేక సందేహాలకు తావిస్తోందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పీఆర్‌ఓ పనబాక కృష్ణయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి విద్రోహం కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రమాదసమయంలో మంటలస్థాయిని చూస్తే ఏదైనా రసాయనాలు లేదా పేలుడు పదార్థాలవల్లే సంభవించి ఉంటుందన్న అనుమానం కలుగుతోందన్నారు. రైల్లోని టీసీ, గార్డులు ఇతర అధికారులు సకాలంలో స్పందించటం వల్ల ప్రమాదం జరగలేదని లేకపోతే భారీ ప్రాణనష్టం జరిగిఉండేదని అన్నారు. బోగీలు కాలటం వల్ల రైల్వేకు 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు.












Click it and Unblock the Notifications