బాసింగబలాలు ఫేమ్ ఈశ్వరసాయి మాధురి రాథోడ్ వ్యవహారం.. సోషల్ మీడియాలో రచ్చ
బాసింగ బలాలు సాంగ్ తో ఫేమ్ అయిన ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి మరో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్.. గదిలో అడ్డంగా దొరికిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. 'బాసింగ బలాలు' పాటతో ఫేమస్ అయిన ఈశ్వర్ సాయి, తోటి జానపద నటి మాధురితో వేములవాడలోని రెడ్డి భవన్‌లో అర్థరాత్రి ఒకే రూమ్‌లో ఉండగా భార్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నా భర్తే నీకు దొరికాడా?" అంటూ మాధురిపై విరుచుకుపడిన భార్య
భార్య గది తలుపు తెరిచి లోపలికి వెళ్లగానే ఇద్దరూ షాక్ అయ్యారు. "నా భర్తే నీకు దొరికాడా?" అంటూ మాధురిపై విరుచుకుపడిన భార్య, ఆమె పైన దాడి చేసింది . బాత్రూంలో ఉన్న భర్తను బయటకు లాగి అందరూ చూస్తుండగా నిలదీసింది. ఇప్పటికే పెళ్లయి ఒక కొడుకు ఉన్నా, మాధురి తో రాసలీలలు సాగిస్తున్నాడు అంటూ భార్య సంచలన ఆరోపణలు చేసింది.

సోషల్ మీడియాలో వైరల్.. ఈశ్వర సాయి భార్య చెప్పిందిదే
ఇక ఇదంతా వీడియో తీయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వ్యవహారం పైన మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ భార్య మాట్లాడుతూ.. మా పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. నా భర్త మంచివాడు, మందు కూడా తాగడు. మాధురియే ఉద్దేశపూర్వకంగా తన భర్తను లోబరుచుకుందని, గతంలో ఆమెకు బ్రేకప్ అయినప్పుడు నేనే ఓదార్చానని పేర్కొంది. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసింది అని ఆవేదన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో భిన్న వాదనలు
ఇలాంటి వాళ్ల వల్ల ఫోక్ ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని కూడా ఈశ్వర్ సాయి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఘటన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. అభిమానులు రెండు వర్గాలుగా వాదులాడుతున్నారు. ఒకవైపు ఈశ్వర్ సాయిని సపోర్ట్ చేస్తుంటే, మరోవైపు ఆమె భార్యను సపోర్ట్ చేస్తున్నారు కొందరు.
పెళ్లి కాని మాధురీ రాథోడ్ జీవితం నాశనం
ఇంకొందరు ఈశ్వర్ సాయి భార్య చేసిన పని పెళ్ళికాని మాధురి రాథోడ్ జీవితాన్ని నాశనం చేసింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఫోక్ డాన్సర్స్ ఇద్దరు కలిసి అనేక పాటలు చేశారు. బయట ఒక ఫేమ్ ను సంపాదించుకున్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ ఒకే గదిలో రెడ్ హ్యాండెడ్ గా దొరకటంతో కొత్త రచ్చ మొదలైంది.













Click it and Unblock the Notifications