4 లక్షల లంచం, రెవిన్యూ అధికారుల పట్టివేత
తిరుపతి : చిత్తూరు జిల్లాలో లంచం తీసుకుంటున్న నలుగురు రెవిన్యూ అవినీతి అధికార్లను అవినీతి నిరోధక శాఖ అధికార్లు పట్టుకున్నారు. సత్యవేడు ప్రత్యేక ఆర్థికమండలి బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో భాగంగా రూ. 18 లక్షల చెక్కులు ఇచ్చేందుకు ముగ్గురు రైతుల దగ్గర నాలుగు లక్షలను అధికార్లు డిమాండ్ చేశారు.
దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికార్లను ఆశ్రయించారు. సత్యవేడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సాయినాథ్, తహశీల్దార్ కృష్ణమూర్తి, వీఆర్వో బాలాజీ, డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తంలు ఒక్కొక్కరు రైతుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకొంటుండగా ఏసీబీకి దొరికిపోయారు.












Click it and Unblock the Notifications