కడప జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త హత్య
కడప : కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడులో తెలుగుదేశం కార్యకర్త శాంతుడుని దుండగులు హత్య చేశారు. శాంతుడు తాగునీరు బిందె తీసుకొని వస్తుండగా ప్రత్యర్థులు మాటువేసి గొడ్డలితో నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్,తెలుగుదేశం మధ్య ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థులు ఆయన్ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, నాయకులను కార్యకర్తలను పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు హత్య చేయిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల హత్యలు ఎక్కువగా జరిగాయని అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది.












Click it and Unblock the Notifications