విజయవాడ-తిరుపతి రైళ్ళు ఆలస్యం
విజయవాడ: ఒంగోలు సమీపంలో జరిగిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో విజయవాడనుంచి చెన్నైవైపు వెళ్లే రైళ్లు, తిరుపతినుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శబరి ఎక్స్‌ప్రెస్‌ను నెల్లూరులోనే నిలిపిఉంచగా విజయవాడనుంచి బయలుదేరే పినాకినీ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. మిగతా రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మార్గంలోని అన్ని స్టేషన్లలో ప్రయాణీకులు గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది.
ఉన్నతాధికారుల సమీక్ష ఉలవపాడు మండలం రాజుపాళెం వద్ద అగ్నిప్రమాదంలో పద్మావతి ఎక్స్‌ప్రెస్ బోగీలు దగ్థమైన విషయం తెలియగానే ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదసమయంలో వచ్చిన పొగతో వూపిరాడక ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులను కందుకూరు ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణీకులను మూడు ప్రత్యేక బస్సుల్లో నెల్లూరు తరలించారు. వీరితోపాటు విజయవాడ స్టేషన్‌నుంచి డిఆర్‌ఎం ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చారు. ప్రమాద కారణాలు టెక్నికల్ టీం విచారణలోనే తేలుతాయని డీఆర్‌ఎం అన్నారు. దెబ్బతిన్న నాలుగు బోగీలను వదిలేసి పద్యావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి బయలుదేరి వెళ్లింది.












Click it and Unblock the Notifications