గంగదేవిపల్లి ప్రజలతో చిరు ముచ్చట్లు
వరంగల్: వరంగల్లు జిల్లా గంగదేవిపల్లి గ్రామ ప్రజలతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గురువారం సాయంత్రం ముచ్చటించారు. గంగదేవిపల్లి జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైందని తెలిసి, దాని వెనక ప్రజల అనుభవాలు తెలుసుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని చిరంజీవి అన్నారు. చిరంజీవి ఇక్కడికి రావడానికి ముందు భారీ వర్షం కురిసింది. దీంతో బహిరంగ సభ స్థలమంతా నీటితో నిండిపోయింది. దీంతో ఆయన బహిరంగ సభ రద్దయింది. గ్రామపంచాయతీ వద్ద ఆయన ప్రజలతో ముచ్చటించారు.
ఆదర్శగ్రామంగా గంగదేవి పల్లిని తీర్చిదిద్దడంలో నాకు నేనేమిటి చేసుకుంటాననే ఆలోచన కాకుండా మన గ్రామానికి మనమేమి చేసుకుంటామనే ప్రజల ఆలోచన ఉందని ఆయన అన్నారు. ఈ గ్రామం గురించి విన్నప్పుడు తాను గర్వపడ్డానని ఆయన చెప్పారు. గ్రామపంచాయతీని తీర్చిదిద్దుకోవడంలో ఏది ప్రభావం చూపిందని తెలుసుకోవడానికి తాను వచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications