నన్ను రప్పించారు: పొన్నాలతో చిరు

వరంగల్: రాజకీయాల్లోకి రప్పించారు, మీ ఊరికి రప్పించారు అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో అన్నారు. వరంగల్ జిల్లా జనగాం చౌరస్తాలో గురువారం చిరంజీవికి పొన్నాల లక్ష్మయ్య తారసపడ్డారు. వరంగల్ జిల్లాలోని గంగదేవి పల్లికి చిరంజీవి వెళ్తుండగా జనగాంలో ఆసక్తకర సన్నివేశం చోటు చేసుకుంది. పొన్నాలతో చిరంజీవి సెల్ ఫోనులో మాట్లాడారు. పొన్నాల లక్ష్మయ్యది వరంగల్ జిల్లా జనగాం స్వస్థలం. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా తాము ఆహ్వానిస్తామని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

జనగాంలో చిరంజీవి అభిమానులు పెద్దయెత్తున స్వాగతం చెప్పారు. చిరంజీవి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గంగదేవి పల్లి చేరుకున్నారు. ఆయనకు ప్రజలు ఘనస్వాగతం చెప్పారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. అందిన వారితో కరచాలనం చేస్తూ మిగతా వారికి రెండు చేతులూ జోడించి అభివాదం చేస్తూ చిరంజీవి గ్రామంలోకి చేరుకున్నారు. ఆర్టీసి బస్సు డ్రైవర్ కిటికీలోంచి తలను బయటకు పెట్టి చిరంజీవితో కరచాలనం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+