గ్రామ స్వరాజ్యం సాధిస్తాం: చిరు
హైదరాబాద్: గ్రామస్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి నిజమైన స్వరాజ్యమని గాంధీజీ అన్నారని, ఆ గ్రామ స్వరాజ్యం సాధించడమే తమ లక్ష్యమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన గురువారం ఉదయం ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని వికలాంగుడైన బాలకృష్ణకు ఇచ్చి ఆ తర్వాత తాను సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత హరిరామజోగయ్య, శోభానాగిరెడ్డిలు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
గాంధీజీ మాటలే స్ఫూర్తిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని, నిస్సహాయులైన వారికి చేయూత ఇవ్వడం ద్వారా వారి ముఖాల్లోని ఆనందాన్ని చూడడం గొప్ప ఆనందమని, ఈ విషయంలో గాంధీ చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. తాను సంతోషాంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కృషి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. మెగా మెయిల్ డాట్ కామ్ ను ఆయన ప్రారంభించింది.












Click it and Unblock the Notifications