తెలంగాణ శక్తుల ఏకీకరణ: దేవేందర్
హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపిపి) అధ్యక్షుడు టి. దేవేందర్ గౌడ్ గురువారం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టారు. 27 రోజుల పాటు తెలంగాణ ఆత్మ గౌరవ యాత్ర చేసిన ఆయన గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఈ దీక్షకు ఇతర తెలంగాణ ఉద్యమ పార్టీల నాయకులను, తెలంగాణకు అనుకూలంగా పార్టీ నాయకులను ఆహ్వానించారు. తెలంగాణ శక్తుల ఏకీకరణకు ఇది ప్రారంభమని దేవేందర్ గౌడ్ ఈ సందర్భంగా అన్నారు.
ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతిలతో పాటు బిజెపి నాయకుడు లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మేధావులు, ఇతర ఉద్యమ సంస్థల నాయకులు వచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమమే ప్రధానమని, ఎన్నికలు ప్రధానం కాదని నారాయణ అన్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్టీపిపి నాయకులు, కార్యకర్తలు దీక్షకు దిగారు. చిన్న రాష్ట్రాల ఉద్యమ ఫోరం ఈ దీక్షకు మద్దతు తెలిపింది.












Click it and Unblock the Notifications