పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం: పవన్
హైదరాబాద్: తమ సోదరుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేవారెవరూ లేరని ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన గురువారంనాడు ప్రజారాజ్యం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చిరంజీవి చేతుల మీదుగా ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చిరంజీవిపై విమర్శలు చేసేవారికి తగిన సమాధానం చెప్తామని ఆయన అన్నారు.
చిరంజీవి అభిమానుల రక్తదాన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చిరంజీవిని విమర్శించేవారి వ్యక్తిత్వాలు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షా 20 వేల మందికిపైగా ప్రయోజనం పొందారని, చిరంజీవిపై చేసే విమర్శలకు వారే సమాధానం చెప్తారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.












Click it and Unblock the Notifications