టిడిపి ఎమ్మెల్సీలకు వైయస్ బ్రేక్ లు
హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్సీలకు, పోలీసులకు మధ్య గురువారం శాసనసభ వద్ద తోపులాట జరిగింది. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మనసు మార్చాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శనకు దిగారు. అయితే ముఖ్యమంత్రి అక్కడికి వచ్చారు. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలను మార్షల్స్ బయటకు పంపారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కిడికి వచ్చారు. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలుగుదేశం ఎమ్మెల్సీలను బయటకు పంపి కాంగ్రెస్ కార్యకర్తలకు దారి కల్పించారు. దీనిపై తాము సభా హక్కుల ఉల్లంఘ తీర్మానం ప్రతిపాదిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు చెప్పారు.
అంతకు ముందు గవర్నర్ ఎన్.డి. తివారీ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, శాసనసభా స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి.












Click it and Unblock the Notifications