త్రిపురలో పేలుళ్లు: ఇద్దరు మృతి
అగర్తలా: త్రిపుర రాజధాని అగర్తలాలో బుధవారం రాత్రి ఐదు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించగా, వంద మంది దాకా గాయపడ్డారు. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు ఒడిగట్టారు. ప్రధాన వ్యాపార కేంద్రాలైన మహరాజ్ గంజ్ బజార్, గోవింద్ వల్లబ్ పంత్ మార్కెట్, రాధానగర్ బస్టాండ్, అగర్తలా మోటార్ స్టాండ్ అభయ్ నగర్ ప్రాంతాల్లో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. బాంబుల తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు.
రాధానగర్ బస్టాండ్ లో రాత్రి ఏడున్నర గంటలకు తొలి బాంబు పేలింది. రాత్రి ఎనిమిది గంటల 15 నిమిషాల లోపల వరుసగా ఐదు బాంబు పేలుళ్లు సంభవించాయి. రాధానగర్ బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్ పై అనుమానాస్పదంగా తిరిగారని, వారు వెళ్లిపోయిన ఐదు నిమిషాల తర్వాత బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుళ్ల వెనక బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ హుజీ హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications