రాస్తారోకో: గుండెపోటుతో రైతు మృతి
కడప: ఎరువులకోసం వచ్చిన ఓ రైతు శుక్రవారం కడప జిల్లాలో హఠాన్మరణం చెందటం తోటి రైతుల్లో విషాదాన్ని నింపింది. కడప జిల్లా దువ్వూరులో రైతులు ఈరోజు ఎరువుల కోసం ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రైతుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. దీంతో అక్కడి రైతుల్లో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications