ప్రజారాజ్యం కాపు రాజ్యం: మంద
విజయనగరం: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ కాపు రాజ్యంగా అభివర్ణించారు. రాష్ట్రాన్ని రెడ్లు, కమ్మలు పాలించారని, ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చిందని, ఇది కాపుల రాజ్యమని ఆయన అన్నారు. చిరంజీవికి సినిమాల్లో నటించడం తప్ప ప్రజాసమస్యలు ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. దండోరా దండయాత్రలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో జెండా ఆవిష్కరించి ప్రసంగించారు.
ఇదిలా ఉంటే, విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామం వద్ద మాలమహానాడు కార్యకర్తలు మందకృష్ణ మాదిగను అడ్డుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. మాలమహానాడు కార్యకర్తల చర్యను నిరసిస్తూ ఆదివారం రాత్రి ఎమ్మార్పీయస్ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications