కాంగ్రెసును దించడమే ధ్యేయం: ఏచూరి
హైదరాబాద్: కాంగ్రెస్ ను అధికారం నుంచి దించడమే వ్యూహంగా రాజకీయ విధానం ఉంటుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన పొత్తులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర కమిటీ సమావేశం అభిప్రాయం తెలుసుకుని ఈ నెల 12 నుంచి 14వతేదీ వరకు కోల్ కత్తాలో జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యం, సిపిఐల పట్ల అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో మతోన్మాద పార్టీని అధికారాన్ని దూరం ఉంచడమనే వ్యూహంతో తాము పని చేస్తామని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేసే విషయమై ఆలోచిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకునే విషయంపై కూడా ఆలోచించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications