ఒబామాకు రష్దీ, లహిరి ప్రచారం
న్యూయార్క్ : భారత సంతతికి చెందిన దాదాపు అర డజన్ మంది రచయితలు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బరాక్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. వీరిలో సాటానికి వర్సెస్ రచయిత సాల్మన్ రష్దీ కూడా ఉన్నారు. ఒబామాకు మద్దతుగా దక్షిణాసియా వాసులు శనివారం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత సంతతి రచయితలు పాల్గొంటారు.
బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్న రష్దీ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఇండియన్ అమెరికన్ రచయితలు జుంపా లహిరి, కిరణ్ దేశాయ్, సుకేతా మెహతా, మనిల్ సూరి, అఖిల్ శర్మలతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ కూడా ఇందులో పాల్గొంటారు. బుకర్, పులిట్జర్ అవార్డు గ్రహితలైన ప్రముఖ రచయితలు ఒక చోటికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం అరుదైన సంఘటన అని, వారు సహజంగానే ఒబామాను బలపరుస్తారని కార్యక్రమ నిర్వాహకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications