వర్గల్ భూముల్లో టాటా ప్రతినిధులు
మెదక్: నానో కార్ల ప్రాజెక్టు ఏర్పాటుకు టాటా మోటార్స్ ప్రతినిధులు సోమవారం మెదక్ జిల్లాలోని వర్గల్ గ్రామంలోని భూములను పరిశీలించారు. వారి వెంట జిల్లా కలెక్టరుతో పాటు రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆదివారంనాడు వారు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ గ్రామంలోని భూములను పరిశీలించారు. అయితే వారికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రైతులు తమ భూములను ఇవ్వబోమంటూ రాస్తారోకో నిర్వహించారు.
నానో కార్ల ప్రాజెక్టును బెంగాల్‌నుంచి తరలిస్తున్న టాటా మోటర్స్ సంస్థ ఏ రాష్ట్రంలో దాన్ని ఏర్పాటుచేయాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. తమను ఆహ్వానించిన రాష్ట్రాలకు వారి ప్రతినిధులు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం మేరకు వారు ఇక్కడ కూడా స్థలాలు పరిశీలిస్తున్నారు. టాటా మోటార్స్ ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సమావేశమయ్యారు. తమకు కల్పించే రాయితీలపై వారు ముఖ్యమంత్రితో మాట్లాడారు. అయితే నానో ప్రాజెక్టు స్థాపనపై తాము ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని టాటా మోటార్స్ ప్రతినిధులు చెప్పారు.












Click it and Unblock the Notifications