తెలంగాణపై నేడే బాబు నిర్ణయం

తాము తెలంగాణకు సానుకూలమని తెలుగుదేశం ఇప్పటికే సంకేతాలిచ్చింది. రెండు, మూడు వాక్యాలతో నిర్ణయం సూటిగా ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబుకు సమర్పించాల్సిన నివేదికపై కమిటీ సభ్యులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, కె.ఇ. కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. కోర్ కమిటీ సమావేశానంతరం మంగళవారం పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. తెలంగాణపై చేయాల్సిన ప్రకటనపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అయితే అధికార ప్రకటన ఎప్పుడు చేయాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.












Click it and Unblock the Notifications