టెర్రర్ ఇ-మెయిల్: కీలక వ్యక్తి అరెస్టు
ముంబయి: ఇండియన్ ముజాహిదీన్ పేరుతో మీడియాకు ఇ-మెయిల్స్ పంపుతున్నకేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన కీలకమైన విఫీ హ్యాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమానితుడు ముంబయిలోని ఓ ప్రముఖ బహుళ జాతి సంస్థలో ఉన్నత స్థాయి హోదాలో ఉన్నాడు. చాలా రోజులుగా అతను ఈ బహుళ జాతి సంస్థలో పని చేస్తున్నాడు. మన్సూర్ అనే వ్యక్తి ఇ - మెయిల్ పంపడానికి వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్ ను హ్యాక్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఉన్నత విద్యాభ్యాసం చేసిన కుటుంబం నుంచి వచ్చాడు.
హై ఫ్రీక్వెన్సీ వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్ ద్వారా ఈ ఇ-మెయిల్ పంపినట్లు పోలీసులు కనుక్కున్నారు. వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్ (విఫీ) ను ఇ - మెయిల్స్ ను పంపడానికి ఇండియన్ ముజాహీదీన్ హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ముంబయిలో 20 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ముంబయి నుంచే కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications