మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి గడువు పెంపు
హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్ల, వైస్ చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించే గడువును నాలుగేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు తక్కువగా ఉండడం వల్ల మున్సిపాలిటీల్లో రాజకీయ అస్థిరత చోటు చేసుకుని, అధికారం కుంటుపడుతోందని, అందుకే ఆ గడువును పెంచాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చెప్పారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని ఆయన చెప్పారు.
మున్సిపల్ ఉద్యోగులకు కూడా పంచాయతీరాజ్ ఉద్యోగులకు మాదిరిగా ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లకు చెందిన డిపాజిట్ ను ఐదు కోట్ల రూపాయల లోపు పనులైతే ఆరు నెలల పాటు తమ వద్ద వుంచుకుని పనులు నాణ్యతను పరిశీలించిన తర్వాత చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు కోట్ల రూపాయల పైబడి పనులకు కాంట్రాక్టర్ల డిపాజట్లను ఏడాది పాటు ఉంచుకోవడానికి వీలు కల్పిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications