బంగారం మోసాల ముఠా అరెస్ట్
ఒంగోలు: నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా నమ్మించి మోసాలు చేయటంలో అందెవేసిన ఓ ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులనుంచి 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ముఠాలోని ఇద్దరు సభ్యులు ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసం ఉండే బియ్యం వ్యాపారిని నమ్మించి మోసగించారు.
వ్యాపారినుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని నకిలీ బంగారు అచ్చును అంటగట్టారు. అనంతరం అది నకిలీదని తేలటంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. వారు ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు. వారు నకిలీ బంగారు అచ్చులు వేయటంలో సిద్ధహస్తులని, వీరు మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు.












Click it and Unblock the Notifications