తెదేపా మాజీ మంత్రి ప్రజారాజ్యం లో చేరిక
ఏలూరు: ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మరడాని రంగారావు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి సోదరుడు నాగబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు ప్రజారాజ్యం ఆవిర్భవించిందనీ, పార్టీ ఆశయాలు నచ్చడంతో తాను ప్రజారాజ్యంలో చేరానని రంగారావు తెలిపారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా ప్రజారాజ్యం కార్యకర్తల, నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. పార్టీలో అందరూ ఒక్కతాటిపై నడిచి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వికలాంగునిచే కార్యాలయ ఆవరణలో పతాకావిష్కరణ చేయించారు. అనంతరం చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల సందేశాలను ఆడియో టేప్‌ద్వారా వినిపించారు.












Click it and Unblock the Notifications