మరో చేనేత కార్మికుడి ఆత్మహత్య
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌జిల్లా మల్లకెల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకలి, అప్పుల బాధ, పని లేకపోవడంతో కుటుంబ పోషణ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శనివారం ఉదయం ధృవపడింది. నేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఒకరు ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడుతునే ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, హామీలు ఇచ్చి వెళుతున్నారు. అధికార పార్టీ అయితే మీకు అన్ని విధాల ఆదుకుంటామని చెబుతున్నా ఆత్మహత్యలు ఆగడంలేదు.












Click it and Unblock the Notifications